Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాథేశ్యామ్ స్టోరీ ఇదే, ప్రభాస్ అభిమానులకు పండగే..!

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (12:18 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాథేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పిరియాడిక్ లవ్ స్టోరీ.. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చాయి.
 
నిర్మాణ సంస్థ కానీ, డైరెక్టర్ కానీ.. ఈ సినిమా కథ గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. జాతకం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపించింది. ఇలా వార్తలు వచ్చినప్పుడు కూడా... చిత్ర యూనిట్ స్పందించలేదు. దీంతో ఇది గాసిప్ ఏమో అనుకున్నారు. అయితే... ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో రాథేశ్యామ్ స్టోరీ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు. 
 
జాత‌కం నేప‌థ్యంలో సాగే క‌థ ఇద‌ని… ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. దాన్ని నిజం చేస్తూ.. మోష‌న్ పోస్ట‌ర్‌లో అర‌చేయి, అందులోని గీత‌ల‌తో టీజర్ స్టార్ట్ చేసారు. రోమియో జూలియ‌ట్‌, స‌లీమ్ అనార్క‌లీ, దేవ‌దాసు పార్వ‌తీ జంట‌ల్ని క‌ళ్ల ముందుకు తీసుకొచ్చి చివ‌రి రాధే శ్యామ్‌ల‌ను చూపించారు. 
 
దీంతో ఇది ప్రేమకథ అని చెప్పకనే చెప్పేసారు. ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments