Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురాపానం ఫ‌స్ట్ లుక్ ఇదే

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:27 IST)
Surapanam look
అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై దర్శకుడిగా వెండితెరకు  పరిచయం కాబోతున్న సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం సురాపానం. కిక్ అండ్ ఫన్ అనేది శీర్షిక. పోస్ట్ ప్రొడక్షన్  పనులు ముగించుకుంది. త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమౌతుంది.
 
సురాపానం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని దర్శకులు వేణు ఉడుగుల శుక్ర‌వారం విడుదల చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఈ కరోన కష్ట కాలంలో ఒక సినిమా నిర్మించి బయటకి తీసుకురావడం అనేది చాలా సంక్లిష్టమైన విషయమని, ఇలాంటి పరిస్థితుల్లో వారు తీసుకున్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో చిత్ర దర్శకులు సంపత్ కుమార్, ప్రొడ్యూసర్ మధు ప్రయత్నం విజయాన్ని సాధించాలని,  సురాపానం ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారని, ఒక ఉన్నతమైనటువంటి కథా వస్తువుతో చిత్రీకరించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
 
సంపత్ కుమార్, ప్రగ్య నయన్, అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, సూర్య, జెన్నీ, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు, విద్యా సాగర్, అంజి బాబు, గిరి పోతరాజు, సురభి ప్రభావతి, త్రిపుర, 
సుజాత దీక్షితులు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సెసిరోలియో అందించగా, మాటలు రాజేంద్రప్రసాద్  చిరుత, కెమెరా విజయ్ ఠాగూర్, ఎడిటర్ జె. పి, నిర్మాతః మధు , కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం సంపత్ కుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments