రవితేజ రావణాసుర లో సుశాంత్ ఫస్ట్ లుక్ ఇదే

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (17:48 IST)
Sushant new still
రవితేజ హీరోగా సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రానికి `రావణాసుర` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. రవితేజ 70వ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్ అనే ముఖ్య పాత్రలో సుశాంత్ నటించనున్నారు. `అల వైకుంఠపురంలో` వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుశాంత్.. రావణాసుర కథ, స్క్రిప్ట్, పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పారు. సుశాంత్ అప్పియరెన్స్ ఈ సినిమాకు బోనస్ కానుంది.
 
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుశాంత్ నీలిరంగు కళ్లతో, పొడవాటి జుట్టుతో, స్టైలీష్ లుక్‌లో కనిపించారు. రామ్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు.. హీరోలు లేరు అనే క్యాప్షన్‌తో సినిమా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోస్టర్‌ను చూస్తుంటే సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు కనిపిస్తోంది.
 
దీపావళి సందర్భంగా విడుదల చేసిన రవితేజ పోస్టర్‌లో న్యాయవాది గెటప్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతోన్నారు. ఈ నెలలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
 
రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.
 
కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments