Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరే ఒక్కరాత్రి నీతో పడుకుంటా.. మరి హీరో పక్కన ఎవరిని పడుకోబెడుతున్నావ్..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:30 IST)
బాలీవుడ్‌లో జరిగిన లైంగిక వేధింపులపై మరో హీరోయిన్ గళం విప్పింది. తన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో శృతి మరాతే చేసిన పోస్ట్ ప్రస్తుతం సనీ వర్గాలలో చర్చనీయాంశం కావడంతో పాటుగా నెట్‌లో వైరల్ అవుతోంది. ఆమె పోస్ట్‌లో ఏమని పేర్కొన్నారంటే.. 
 
నా 16 ఏళ్ల వయసు నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ముందు కెమెరా వెనుక ఎన్నో కష్టాలు పడ్డాను. సినీ తారలంటే ఎంతో సౌకర్యవంతమైన జీవనం సాగిస్తూ సంతోషంగా ఉంటారని ప్రజలకు అపోహలు ఉంటాయి, కానీ వారనుకునేది పొరపాటని పేర్కొన్నారు. నా కెరీర్ మొదట్లో ఒక దక్షిణాది సినిమాలో అవకాశం వచ్చి నటించాను. 
 
ఆ సినిమాలో నన్ను బికినీ ధరించమని అడిగితే సరేనన్నాను. ఆ సమయంలో ఎలా షూట్ చేస్తారు? ఇది అవసరమా అని ఆలోచించలేదు, ఎందుకంటే నాకు సినిమా అవకాశం వచ్చిందని మాత్రమే ఆలోచించాను. ఆ తర్వాత నేను పాపులర్ అయ్యాక ఓ షోలో పాల్గొన్నప్పుడు బికినీపై ట్రోల్స్ చేసిన విషయం తెలుసుకున్నాను.
 
ఓ సినిమా అవకాశం విషయంగా మాట్లాడటం కోసం నిర్మాతను కలిశాను. మొదట్లో బాగా మాట్లాడినప్పటికీ రాన్రానూ అతని వికృత చేష్టలు అర్థమయ్యాయి. ఆఫర్ ఇస్తాను, కానీ ఒక్క రాత్రి నాతో పడుకోవాంటూ వేధించాడు, అప్పుడు నేను సరే నీతో పడుకొంటాను, మరి హీరోతో ఎవరిని పడుకోబెడుతున్నావ్ అని అడిగిన వెంటనే అతను షాకయ్యాడని శృతి మరాతే వెల్లడించారు. 
 
ఆ సమయంలో నేను ఎంతో ధైర్యంగా వ్యవహరించడం నాకు చాలా మంచి పని చేసినట్టు అనిపించింది. అయితే ఆ తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తొలగించినప్పటికీ నేనేం బాధపడలేదని తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు శృతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం