Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు ప్రేమతో అంటే అర్థ కాలేదు, ప్రేమదేశం అనగానే గుడ్‌ అన్నారు : మధుబాల

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (17:26 IST)
madhubala
రోజా, అల్లరి ప్రియుడు వంటి చిత్రాలతో యూత్‌ను అలరించిన హీరోయిన్‌ మధుబాల. చాలాకాలం గేప్‌ తీసుకుని ఇప్పుడు తెలుగులో మరలా ఎంటర్‌ అయింది. తాజాగా  ప్రేమదేశం చిత్రంలో హీరోయిన్‌ అమ్మగా నటించింది. సెట్లో అందరూ హీరోయిన్‌గా వున్నావని, అందం గురించి చర్చ చేశారని చెబుతూ, అందం అనేది గాడ్‌ గిఫ్ట్‌. మా నాన్నగారు 80 ఏళ్ళలోనూ చాలా బాగుంటారు. అమ్మ, నాన్న జీన్స్‌ బట్టి వచ్చింది అని తెలిపింది.
 
ముంబైలో వుంటున్న తాను ఓసారి పెండ్లికి వెళ్ళాను. అక్కడ బఫే చేస్తుండగా ఓ పొడుగాటి మనిషి వచ్చి ఆంటీ అన్నాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. సీరియస్‌ అయ్యాను కూడా. ఆ తర్వాత ఇవన్నీ మామూలేకదా అనిపించింది అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. నటిగా దూరంగా వుండడంతో చాలామంది రెండు సీన్లు అంటూ నా దగ్గరకు వచ్చేవారు. అవన్నీ వద్దన్నా. కానీ ప్రేమదేశం కథ, దర్శకుడు, సంగీత దర్శకుడు మణిశర్మ పాటలు విన్నాక చేయాలనిపించింది చేశాను. పాత్ర కూడా పెద్దదే. ప్రస్తుతం ఐదు సినిమాలు రెడీగా వున్నాయి. వచ్చే ఏడాది ఐదు సినిమాలు విడుదలకాబోతున్నాయి అని చెప్పింది. 
 
నాకు లవ్‌ స్టోరీస్‌ అంటేనే ఇష్టం. ముంబైలో నాకు స్నేహితులు ఎక్కువ. ఏం సినిమాలు చేస్తున్నావ్‌ అని అప్పుడు అడిగితే. ఎన్‌.టి.ఆర్‌.తో నాన్నకు ప్రేమతో అని చెప్పాను. వారికి అర్థంకాలేదు. అదే సినిమా అంటూ క్వశ్చన్‌ మార్క్‌ పెట్టారు. కానీ ఇప్పుడు ప్రేమదేశం అని చెప్పగానే గుడ్‌.. మంచి మూవీ అని అన్నారు అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments