ఆచార్య‌లో హింస వుంది అందుకే యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డ్‌

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:42 IST)
Achrya poster
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో న‌టించిన సినిమా `ఆచార్య‌`.  కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే సెన్సార్‌కు వెళ్ళింది. ఇందులో కొర‌టాల శివ మార్క్ క‌నిపించింది. క‌థ ప్ర‌కారం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కుటుంబ విలువలు వున్నా. మిర్చి సినిమాను మించిన వ‌యొలెన్స్ ఇందులో వుంద‌ట‌. అందుకే యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. రామ్‌చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
 
శుక్ర‌వారంనాడు సెన్సార్ పొందింది. అదేవిధంగా   మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా ఈరోజే అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక ఈనెల 23న యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్‌లో ఆచార్య ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌లో సినిమా నేప‌థ్యం గురించి మెగాస్టార్ వివ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈనెల 29న ఆచార్య విడుదల కాబోతుంది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments