Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ప్పూ ఒప్పులు లేవు. అధికారం మాత్ర‌మే శాశ్వ‌తం అంటోన్న ర‌మ్య‌కృష్ణ‌

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (18:06 IST)
Ramya krishna
న‌టి ర‌మ్య‌కృష్ణ ఎటువంటి పాత్ర చేసినా అందులో ఇమిడి పోతారు. బాహుబ‌లిలో ఆమె చేసిన పాత్ర ఇంకా ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తిండిపోయింది. అప్పుడెప్పుడో న‌ర‌సింహ‌లో ర‌జ‌నీకాంత్ ప్రేమ‌కు తిర‌స్క‌రించ‌బ‌డి ప‌గ‌తో ర‌గిలిపోయిన పాత్ర‌లో ఆమెను త‌ప్ప మ‌రెవ్వ‌రినీ ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే. ఇక తాజాగా ఆమె ఓ వివిధ్య‌మైన పాత్ర‌ను పోషిస్తోంది. ఆ పాత్ర పేరు విశాఖ వాణి. `రిప‌బ్లిక్‌` అనే సినిమాలోని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అది. ఆ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను కొటేష‌న్‌ను చిత్ర యూనిట్ శ‌నివారంనాడు విడుద‌ల చేసింది. ఆమె పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసి `త‌ప్పూ ఒప్పులు లేవు. అధికారం మాత్ర‌మే శాశ్వ‌తం ` అన్న కాప్ష‌న్‌ను పెట్టింది. ఈ లుక్‌ను విడుద‌ల‌చేసిన అనంత‌రం రిప‌బ్లిక్ హీరో సాయితేజ్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. ర‌మ్య‌కృష్ణ లాంటి మ‌హాన‌టితో న‌టించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నేను ఈ సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా వున్నానంటూ పేర్కొన్నారు. 
 
దేవ్‌ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. ఇటీవ‌లే సాయితేజ్ లుక్‌కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కూలింగ్ గ్లాస్‌లో హీరో ఎవ‌రితో చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. భార‌త‌దేశం స్వాతంత్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. “డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంతుందో కూడా తెలీదు మనకు” అనుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసే అభి అనే యువ‌కుడిగా సాయితేజ్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు.
 
జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

యువతిని పొట్టనబెట్టుకున్న పెద్దపులి.. పొలాల్లో పనిచేస్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments