Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్‌ను ఓ లుక్కేయండి (video)

యువ హీరో నితిన్ తాజా సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ గురువారం విడుదలైంది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందితా శ్వేత మరో కథానాయిక. ఈ చిత్రానికి వేగేశ్న సతీష్‌ దర్శకత్

Webdunia
గురువారం, 19 జులై 2018 (11:11 IST)
యువ హీరో నితిన్ తాజా సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ గురువారం విడుదలైంది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నందితా శ్వేత మరో కథానాయిక. ఈ చిత్రానికి వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 
 
తాజాగా విడుదలైన కాన్సెప్ట్ టీజర్లో ''మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ సంతోషిస్తారు. ఈ విషయం మనకు తెలీదు. మనం చనిపోయినప్పుడు అందరూ బాధపడతారు. ఈ విషయం కూడా మనకు తెలీదు. మనకు తెలిసినంతవరకు మనం సంతోషంగా ఉండి మనవాళ్లంతా సంతోషంగా ఉండేది ఒక పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ ''శ్రీనివాస కల్యాణం'' అంటూ ప్రముఖ నటి జయసుధ వాయిస్ ఓవర్ వీడియోలో వినిపిస్తుంది. 
 
ఇక కల్యాణం.. వైభోగం అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న సంగీతం వినసొంపుగా ఉంది. ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకులమ ముందుకు రానుంది. ఈ నెల 22వ తేదీన శ్రీనివాస కళ్యాణం ఆడియో విడుదల కానుందని కాన్సెప్ట్ వీడియోలోనే చెప్పేశారు. నితిన్, రాశీఖన్నా, నందిత శ్వేత, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలుగా దిల్‌రాజు, శిరీష్ వ్యవహరిస్తున్నారు. సంగీతం- మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ- సమీర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments