Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవిష్ణు చిత్రానికి సామజవరగమన టైటిల్ ఖరారు

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (14:36 IST)
Samajavaragamana look
హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఓ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది.
 
వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ చిత్రానికి సామజవరగమన అనే టైటిల్‌ను పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ హిలేరియస్ గా ఉంది. శ్రీవిష్ణు చేతిలో వీణ పట్టుకుని కనిపించగా, వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా జాన్ సంగీత వాయిద్యంతో కట్టివేస్తున్నట్లు ఫస్ట్ లుక్ నవ్వులు పూయించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సామజవరగమన పూర్తిగా ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే భావన కలిగిస్తుంది.
 
భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి  పని చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
తారాగణం: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments