Webdunia - Bharat's app for daily news and videos

Install App

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

డీవీ
గురువారం, 30 జనవరి 2025 (13:17 IST)
Movie Killer
దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.
 
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూడో షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొని, కీలకమైన యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలను అద్భుతంగా మిళితం చేస్తూ, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ త్వరలో రెడీ అవుతోంది. “కిల్లర్” కు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments