Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాలిన్‌కు కోవిడ్ నివార‌ణ‌కోసం కోటి విరాళం అంద‌జేసిన సూర్య కుటుంబం

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:35 IST)
sivakumar, suriya, karti
కోవిడ్ వైర‌స్ అనేది దేశ‌వ్యాప్తంగా వున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోనూ విప‌రీతంగా వ్యాపించి వుంది. ఎంతోమంది ఎన్నో ర‌కాలుగా కోవిడ్ బాధితుల‌కు సాయం చేస్తున్నారు. అందుకే త‌మ వంతు బాధ్య‌త‌గా సీనియ‌ర్ న‌టుడు శివ‌కుమార్‌, అత‌ని కొడుకులై సూర్య‌, కార్తిలు కూడా కోటి రూపాయ‌ల విరాళాన్ని ఇచ్చారు. త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రి అయిన స్టాలిన్‌కు వారు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, సి.ఎం. ఫండ్ కింద కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. కోవిడ్‌19 బారిన ప‌డిన బాధితుల‌కు సానుభూతిని తెలియ‌జేశారు.
 
ఇదిలా వుండ‌గా, ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కార్తీ 'మాస్క్ పొడు' అనే వీడియో సాంగ్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యం. అయితే మాస్క్ ప్రాధాన్యతను తెలుపుతూ 'మాస్క్ పొడు' సాంగ్ వచ్చింది. "కరోనా నుంచి రక్షణకు ఉత్తమ మార్గం! #maskpodu మాస్క్ ధరించండి. టైట్ గా ధరించండి. సరిగ్గా ధరించండి. డబుల్ మాస్క్ ధరించండి!" అంటూ కార్తీ ఈ వీడియోను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments