Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్ సిరీస్

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (16:48 IST)
The Mystery of Moksha Island
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్". హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" సిరీస్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
 
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - నికోబార్ ఐల్యాండ్స్ లో ఉన్న ప్రైవేట్ ఐల్యాండ్ మోక్ష ను విజిట్ చేసేందుకు వెళ్తారు ఆ ఐల్యాండ్ వారసులు. మోక్ష ఐల్యాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అతనికి ప్రతిబింబం లాంటిదే ఈ ఐల్యాండ్. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వీరి హత్యలకు కారణం ఏంటి ?, అందమైన మోక్ష దీవిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరు సృష్టిస్తున్నారు ?. వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు ? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. "ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్" సిరీస్ పై కావాల్సినంత క్యూరియాసిటీని ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.
 
నటీనటులు - అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ, పావని రెడ్డి, సుధ, భాను చందర్, రాజ్ తిరందాసు, అజయ్ కతుర్వార్, అక్షర గౌడ, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments