Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సందీప్‌కిషన్‌కు చేజారిన లక్క్‌- మరో హీరోకు దక్కింది

Webdunia
సోమవారం, 3 జులై 2023 (13:08 IST)
Sandeep Kishan,
సినిమాలు చేయాలంటే అందుకు ఆవగింజంత అదృష్టం కూడా వుండాలి అంటారు. అది వుంటేనే రాత్రికి రాత్రి సక్సెస్‌ హీరో అయిపోతాడు. అలా గతంలో పలువురు హీరోలుఅయిన సందర్భాలు వున్నాయి. ఓ కథకు ఓ హీరోను అనుకుని ఆ తర్వాత మరో హీరో పేరును ఆ హీరోను చెప్పడం విశేషం. అలాంటి గతంలో సూపర్‌స్టార్‌ కృష్ణ బిజీగా వున్న టైంలో ఖైదీ సినిమా ఆయన ముందుకు వచ్చింది. కానీ అప్పుడు కృష్ణ చాలా బిజీ. ఆ టైంలో కొత్త కుర్రాడు చిరంజీవి వచ్చాడు. అతని దగ్గరకు వెళ్ళండని కృష్నగారే నిర్మాతకు సూచించారట.
 
ఇప్పుడు అలాంటి ఘటన సందీప్‌ కిషన్‌ కెరీర్‌లో జరిగింది. తను మైఖైల్‌ సినిమా చేస్తుండగా కొత్త దర్శకుడు వచ్చి ఆయనకు ఓ కథ వినిపించాడు. డేట్స్‌ కుదరక హీరో శ్రీవిష్ణు పేరు సూచించాడట. దాంతో అతను శ్రీవిష్ణుకు కథ చెప్పడంతో తనుకూడా కొంత మొత్తం పెట్టుబడి పెట్టి అనిల్‌ సుంకర నిర్మాతతో కలిసి సినిమా నిర్మించారు. అదే సామజవరగమన సినిమా. అది విడుదలైన నాటి నుంచి హిట్‌ టాక్‌తో నడుస్తుంది. ప్రస్తుతం థియేటర్లు అన్నిచోట్ల పెరిగాయి. దీనితో అంతకుముందు మహాసముద్రము, ఏజెంట్‌ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాత అనిల్‌ సుంకర ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుని ఆనందంతో వున్నారు. ఈ సినిమా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న హీరో శ్రీవిష్ణుకు కలిసివచ్చిన అంశం. ఆ సక్సెస్‌ కళ హీరో, నిర్మాతలోనూ బాగా కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అబద్ధాలను అందంగా చెప్పడంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: వైఎస్ షర్మిల

యువతిని పొట్టనబెట్టుకున్న పెద్దపులి.. పొలాల్లో పనిచేస్తుండగా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments