Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌ సినీ కెరీర్‌లో ఆఖరి సినిమా దళపతి 69 పూజతో ప్రారంభం

డీవీ
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:28 IST)
Vijay Entry his movie pooja
విజయ్‌ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్‌ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ.
 
Vijay 69 pooja opening
శనివారం నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. దళపతి కెరీర్‌లో హిస్టారిక్‌ ప్రాజెక్ట్ ఇది. సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే. దళపతి ఫ్యాన్స్ కి ఇదొక ఎమోషనల్‌ ప్రాజెక్ట్.
 
విజయ్‌ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, నేషనల్‌ అవార్డ్ విన్నింగ్‌ యాక్ట్రెస్‌ ప్రియమణి, వెటరన్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌, రెయిజింగ్‌ స్టార్‌ మమిత బైజు ప్రధాన పాత్రల్లో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
 
హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కేవీయన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌ కె నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరమీద విలక్షణమైన నటనతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న విజయ్‌ కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న సినిమా ఇది. అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. ప్రదీప్‌ ఇ రాఘవ్‌ ఈ సినిమాకు ఎడిటింగ్‌ విభాగాన్ని హ్యాండిల్‌ చేస్తున్నారు. అనల్‌ అరసు యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సెల్వ కుమార్‌ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. పల్లవి సింగ్‌ కాస్ట్యూమ్స్ విభాగాన్ని హ్యాండిల్‌ చేస్తున్నారు.  'ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు', 'మాస్టర్‌' సినిమాలకు పనిచేసిన సత్యన్‌ సూర్యన్‌.. దళపతి 69 ని మరో రేంజ్‌లో చూపిస్తారనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో క్రియేట్‌ అయింది.
 
ప్యాన్‌ ఇండియా రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. తమిళ్‌, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ సినిమా. విజయ్‌ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ఆయన నటిస్తున్న చివరి సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments