Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌ లో కొరియోగ్రాఫర్ ప్రభు దేవాకు కన్నప్ప టీమ్ స్వాగతం

డీవీ
సోమవారం, 4 మార్చి 2024 (16:36 IST)
Prabhu Deva
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది.
 
భారతదేశపు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇక ఇప్పుడు విష్ణు మంచు తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో ప్రారంభమైందని కన్నప్ప మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments