Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రాండ్‌గా లాంచ్ అయిన డ్యూడ్ ఓటిటి యాప్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:21 IST)
Ishwar, Rajeev, Vishnu Boppana, Hari Ganesh,
COVID-19 మహమ్మారి కారణంగా డిజిటల్ రంగం ప్రజలకు అత్యంత చేరువ కావడంతో వీక్షకులకు వినోదాన్ని అందించేందుకు అనేక ఓటిటి లు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాయి. ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా వెలసిన అనేక ఓటిటి ప్లాట్‌ ఫారమ్‌లు ప్రజలను అలరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్‌ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది "డ్యూడ్"(DUDE) ఓటిటి. మే 15 న సినీ, అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా "డ్యూడ్"(DUDE) ఓటిటి  యాప్ లాంచ్ ఘనంగా జరిగింది.
 
ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఇంత చిన్న వయసులో అన్ని సెక్షన్స్ చూసుకుంటూ ఓటిటి రంగంలోకి ఎంటర్ అయ్యి ట్యాలెంట్ ఉన్న వారికి అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఈశ్వర్ & టీం కు అల్ ద బెస్ట్ అని అన్నారు
ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ..ఇప్పటి వరకు చాలా ఓటిటి లు చాలా వున్నా..డ్యూడ్ ఓటిటి ద్వారా  ఈశ్వర్, సాహిత్, క్రియటివ్ టీం వీరందరూ కలసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చేస్తున్న కొత్త ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
దర్శక, నిర్మాత" డ్యూడ్"(DUDE) ఓటిటి వ్యవస్థాపకుడు ఈశ్వర్ మాట్లాడుతూ.. డ్యూడ్ అనేది ఒక బ్రాండ్ కావాలి.డ్యూడ్ ఓటిటి అంటే నాది కాదు మనది. అక్కడ చూస్తున్న  అమ్మ ,నాన్న, అక్క, చెల్లి ఎవరైనా పర్లేదు అందరికీ చెబుతున్నా నీ ఇంట్లో నీ తమ్ముడు ఇలా ట్యాలెంటెడ్ గా ఉంటే  వాళ్ళను మాకు కనెక్ట్ చేయవచ్చు. అందుకే డ్యూడ్ ఓటిటి డోర్స్ ఎప్పుడూ ప్రతిభ ఉన్న వారిని వెల్ కం చెపుతుంది. అందుకే చాలా మంది ప్రొడ్యూసర్స్ గాని డైరెక్టర్స్ గానీ సీరియస్ గా అందరూ చెప్పేది ఒకటే మీరు పంపించారు అంటే మేము మా దాంట్లో తీసుకుంటాం అని చెప్పారు. కోటి రూపాయలకి తీసే సినిమా ను నేను 30 లక్షలకు సినిమా తీస్తాను.అంటే కోటి రూపాయలకు మూడు సినిమాలు అంటే 300 కోట్లకు తొమ్మిది వందల సినిమాలు అంటే 900 డైరెక్టర్స్ ను ఒకేసారి లాంచ్ చేసే గట్స్ డ్యూడ్ ఓటిటి కి ఉంది.నాకు చాలా మంది ఇన్వెస్టర్ల నుండి కాల్స్ వస్తున్నాయి. డైరెక్టర్స్ అందరితో మళ్ళీ సినిమా చేపించి వీరి కళా ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ వీరితో ఫ్యూచర్ ఫిల్మ్ కూడా చేపిస్తానని మా డైరెక్టర్స్ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను.అలాగే నేను సంవత్సరానికి నాలుగు అవార్డ్స్ ఫంక్షన్స్ చేస్తాను వెండితెర బుల్లితెర ,డైరీ ఫంక్షన్,ఇలా ప్రతీది కూడావెబ్ స్ట్రీమింగ్ జూన్ నుంచి ఉంటుందని కోరుకొంటున్నాను.  మంచి వెబ్ సిరీస్ చేస్తాము. నాకు మంచి టీమ్ ని మంచి ప్రపంచాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించడం జరుగుతుంది అన్నారు.
 
ఈస్ట్ వెస్ట్ సి.ఈ.ఓ రాజీవ్ మాట్లాడుతూ..   ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫైర్ ఉంటుంది.దాన్ని ఎప్పుడు ఎక్కడ ఇంజెక్ట్ చెయ్యాలో తెలిసినప్పుడే అందరూ ఈశ్వర్ లా అవుతారు.తను కరెక్ట్ పర్సన్ ఎందుకంటే తనకు సినిమా అంటే ఎంతో పిచ్చి.తను పడిన స్త్రగుల్స్ అన్ని ఆలోచించి వీళ్ళెవ్వరు.. మీరెవ్వరు..ఇది  చూస్తున్న వారెవ్వరూ పడకూడదని మీ కోసం మన డ్యూడ్ లాంచ్ చేశాడు. డ్యూడ్ అనేది కంటెంట్ మేకర్స్ కు ఇదొక స్కూల్. ప్రి కేజీ నుండి పీజీ వరకు మనము ఎలాగైదే చదువుకుంటామో సినిమా అంటే పిచ్చి ప్యాషన్. 24 క్రాఫ్ట్స్ మీద ఒక నాలెడ్జ్ కావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక డ్యూడ్ స్కూల్.దానికి చాలా మంది ఎక్సపిరియన్స్ దర్శకులు ఈ బోర్డ్ లో వున్నారు.కొన్ని ఓటిటి లో ఇన్ బుల్ట్ కంటెంట్ పెట్టు కుంటారు. అంటే వారికి వారె డెవలప్ కావాలి అంటే ఓన్ గా తనొక్కడే డెవలప్ అవుతాడు. అయితే డ్యూడ్ ఓటిటి అలా లేదు..అన్ని డిపార్ట్మెంట్స్ రమ్మని చెపుతూ నాకు నేను డెవలప్ అవ్వను రండి మనందరం కలసి డెవెలప్ అవుదాము. నేను ఆపర్చునిటీ ఇవ్వడం లేదు మీ ట్యాలెంట్ తోనే మనందరం కలసి మన ఓటిటి ను ముందుకు రన్ చేద్దాం అంటున్నారు.ప్రేక్షకుల ముందుకు వచ్చిన "డ్యూడ్"(DUDE) ఓటిటి అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
 
నటుడు విష్ణు బొప్పన మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం మేము క్యాలెండర్స్, డైరీస్ వేస్తుంటాము.అయితే ఈశ్వర్ ను చూసిన తరువాత నాకు నా గతం గుర్తుకువచ్చింది. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనకు సహకరించాలని డ్యూడ్ ఓటిటిలోకి జాయిన్ అవ్వడం జరిగింది.
బిందు సార దర్శకుడు మాట్లాడుతూ.. నాకు ఈశ్వర్ బెస్ట్ ఫ్రెండ్.నా టోల్ ఫ్రీ నంబర్ ఈశ్వరే.. నాకు ఏ అవసరం వచ్చినా తనకే ఫోన్ చేస్తా..అలాగే ఈ డ్యూడ్ ఓటిటి మంచి ప్రజాదరణ పొందాలని అన్నారు.
 
దర్శకుడు, రైటర్ హరి గణేష్ (తమిళ్) మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరూ కాసుల కోసం పని చేస్తుంటే మా తమ్ముడు ఒక కాజ్ కోసం పని చేస్తున్నాడు. ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్ ను వెతికి పట్టుకోవడానికి తానొక హంటర్ అవుతున్నాడు. ఆపర్చునిటీస్ లేని వారికి ఒక ప్లాట్ ఫామ్ కావాలి.ఎన్నో కళలతో ఇండస్ట్రీకి వచ్చే వారికి డ్యూడ్ ద్వారా ఆపర్చునిటీస్ కల్పిస్తున్న ఈశ్వర్ గారికి ధన్యవాదాలు అన్నారు.
నటుడు క్రేజీ అభి మాట్లాడుతూ.. ఒకప్పుడు అవకాశాల కోసం తిరిగే ఈశ్వర్ ఈ రోజు అవకాశాలు ఇచ్చే స్టేజ్ కు ఎదిగాడు.ఈ డ్యూడ్ ఓటిటి దిన దినదినాభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈశ్వర్ గారి "డ్యూడ్"(DUDE) ఓటిటి అంచెలంచెలుగా ఎదుగుతూ  వీక్షకుల మనసును గెలుచు కోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments