చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న గాడ్ ఫాదర్ ముంబై షెడ్యూల్ పూర్తి

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (18:30 IST)
producers with Salman, chiru
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవ‌లే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. `మీ ఉనికి ప్రేక్షకులకు  అద్భుత కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు.’ అని చిరంజీవి ఈ సంద‌ర్భంగా పోస్ట్‌ చేశారు. స‌ల్మాన్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు.  స‌ల్మాన్‌, చిరంజీవిపై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే. స‌ల్మాన్ ఖాన్‌కు సంబంధించిన షూట్ సోమ‌వారంతో పూర్త‌యింది. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు RB చౌదరి & NV ప్రసాద్ ముంబై సెట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా స‌ల్మాన్ ఖాన్‌, చిరంజీవిని క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. ఈ ఫొటోను చిత్ర యూనిట్ ఈరోజు విడుద‌ల చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది.
 
మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బాణీలు అందిస్తున్నారు. అనేక బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌కి ఆర్ట్ డైరెక్టర్ గా ప‌నిచేసిన సురేష్ సెల్వరాజన్ - ఈ సినిమా ఆర్ట్‌వర్క్‌ని చూసుకుంటున్నారు.
కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
 స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ రాజా,  నిర్మాతలు: RB చౌదరి & NV ప్రసాద్,  సమర్పకురాలు: కొణిదెల సురేఖ, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిల్మ్స్,  సంగీతం: S S థమన్, DOP: నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాకాడ అప్పారావు, PRO: వంశీ-శేఖర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments