Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్...

''గౌతమీపుత్ర శాతకర్ణి'' ఈ సినిమా బాలకృష్ణ నటిస్తున్న100వ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆయ‌న కెరీర్‌లోనే ఓ ప్ర‌తిష్టాత్మ‌క మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విల‌క్ష‌ణ చిత్రాల

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (17:25 IST)
''గౌతమీపుత్ర శాతకర్ణి'' ఈ సినిమా బాలకృష్ణ నటిస్తున్న100వ సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆయ‌న కెరీర్‌లోనే ఓ ప్ర‌తిష్టాత్మ‌క మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శాత‌వాహ‌నుల రాజు గౌత‌మీపుత్ర శాత‌కర్ణి జీవిత గాథ ఆధారంగా రూపొందిస్తున్నారు.
 
ఇందులో బాలయ్యకు తల్లిగా హేమ‌మాలిని, హీరోయిన్‌గా శ్రియా నటిస్తోంది‌. ఇప్ప‌టికే దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే పాట‌ల షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని సినిమా యూనిట్‌ విడుదల చేసింది. ఇప్ప‌టికే షూటింగ్ నాడు ఓ లుక్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ద‌స‌రా కానుక‌గా ఈ ఫ‌స్ట్ లుక్‌ని విడుదల చేశారు. బాలయ్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అని చెప్పొచ్చు. 
 
సింహాసనంపై బాలయ్య కూర్చుని పక్కన పక్కన సింహం తలమీద చేయి పెట్టిన తీరు ఔరా అనిపిస్తోంది. రాజసం ఉట్టిపడేలా బాలయ్య కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పోస్టర్ బ్యా గ్రౌండ్ అంతా కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా టీజర్‌ను విజయ దశమి రోజు ఉదయం 10.15 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ఈ పోస్టర్లోనే ప్రకటించారు. 
 
బాలయ్య వందో సినిమాకు తగ్గట్లుగా ఓ భారీ చారిత్రక కథ ఎంచుకుని మొత్తం తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు క్రిష్. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే ఇది తెలుగు సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments