ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

దేవీ
శనివారం, 21 జూన్ 2025 (19:14 IST)
Brahmanandam, Satya and others
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపించిన ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.
 
ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్ సృష్టిస్తారు నడిపించేలా తన ప్రెసెన్స్ & పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని  ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్ లోని సంగీతం చాలా బాగుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments