Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

డీవీ
సోమవారం, 23 డిశెంబరు 2024 (17:01 IST)
Anandi, Naresh and others
ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ కుమార్తె టిజి కృతి ప్రసాద్ గరివిడి లక్ష్మి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. జె.ఆదిత్య కెమెరామ్యాన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా గౌరీ నాయుడు జమ్మూ దర్శకత్వంలో 'గరివిడి లక్ష్మి' టైటిల్ తో సినిమా గ్రాండ్ గా ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో గ్రాండ్ గా జరిగింది. హీరోయిన్ ఆనంది, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాను సెలబ్రేట్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్‌లలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ సరికొత్త చొరవను వెటరన్ యాక్టర్ నరేష్, ఎమ్మెల్యే పార్ధసారధి ప్రశంసించారు, ఇది ప్రాజెక్ట్‌పై నిర్మాతల విశ్వాసాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చిత్రం ఉత్తర ఆంధ్రాకు చెందిన ఐకానిక్ బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన కథను, మహిళల గుర్తింపు ఇతివృత్తాన్ని చిత్రీకరిస్తుంది.
 
ఎమ్మెల్యే పార్ధసారధి ఫస్ట్ క్లాప్‌ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ ‌కెమెరా స్విచాన్‌ చేయడంతో పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్క్రిప్ట్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న అపారమైన విశ్వాసం ఈవెంట్ గొప్పతనంలో స్పష్టంగా కనిపించింది, ఇది సినిమా విజయంపై వారి నమ్మకాన్ని చూపింది. జనవరి మూడో వారంలో ఆదోనిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
 
తారాగణం: వెటరన్ యాక్టర్ నరేష్ , రాశి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments