Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల ప్రదర్శనకే ఇష్టపడను.. లిప్‌ లాక్‌ సీన్లు చేస్తానా.. నెవర్

లిప్ లాక్ సీన్లు చేస్తేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడానికే ఇష్టపడతా అంటూ భీకర ప్రతిజ్ఞ చేసింది వర్థమాన హీరోయిన్ మంజిమా మోహన్. గతంతో పోలిస్తే ప్రేక్షకుల అభిరుచుల్లో అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. గ్లామర్‌– అశ్

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (02:40 IST)
లిప్ లాక్ సీన్లు చేస్తేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడానికే ఇష్టపడతా అంటూ భీకర ప్రతిజ్ఞ చేసింది వర్థమాన హీరోయిన్ మంజిమా మోహన్. గతంతో పోలిస్తే ప్రేక్షకుల అభిరుచుల్లో అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. గ్లామర్‌– అశ్లీలానికి తేడా వాళ్లకు తెలుసు. అందాల ప్రదర్శనకే ఇష్టపడని నేను లిప్‌ లాక్‌ సీన్లు చేస్తానని ఎలా చెబుతాను అంటూ ప్రశ్నించిందీ ముద్దుగుమ్మ. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యతో జోడీ కట్టిన ఈ భామ ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదన్నది తెలిసిన విషయమే. 
 
తెలుగులో అవకాశాలు రానప్పటికీ ‘మంజిమా లిప్‌ లాక్‌ సీన్లకు, స్కిన్‌ షో చేయడానికి రెడీ’ అనే వార్త  టాలీవుడ్‌లో షికారులో ఉంది. దీని గురించి మంజిమా ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగానే మంజిమా మీడియా అడిగిన్న ప్రశ్నకు ఘాటుగా స్పందించారు. హీరోయిన్‌ అన్నాక గ్లామరస్‌గా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాళ్ల కోసమే తాము గ్లామరస్‌గా కనిపిస్తుంటామని కొంతమంది కథానాయికలు అంటుంటారు. లిప్‌ లాక్, బికినీ సీన్స్‌ చేసినప్పుడు కథ డిమాండ్‌ చేసిందంటుంటారు. 
 
ముద్దుగుమ్మలు ఏం చెప్పినా వినడానికి బాగుంటుంది. అయితే, మంజిమా మోహన్‌ ఇలాంటివన్నీ చెప్పనే చెప్పరు. ఎందుకంటే, ఈ బ్యూటీ లిప్‌ లాక్‌ సీన్స్‌ చేయరట. కానీ ఎక్కడా అవకాశాలు లేకపోతే అద్భుత నటి సౌందర్య సైతం మోడ్రన్ దుస్తులతో అందాల ప్రదర్శనకు ఎలా సిద్ధమైపోయారో తెలుసు. మంజిమాకు మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments