Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకండ్ హీరోయిన్ నుంచి ఐటమ్ గర్ల్ దాకా.. పయనం... ఏంటి కేథరిన్ ఇది?

తెలుగు తెరపై అందాల ఆరబోతకు అందరికంటే ముందే సై అనే ఆ ముద్దుగుమ్మకు సుడి బాగా ఉన్నట్లు లేదు. ఎంతగా అందాలారబోసినా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతోంది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌తో కలిసి అల్లుఅర్జున్‌తో వీరలెవల్‌లో అందాలను ఆరబోసిన

Webdunia
బుధవారం, 5 జులై 2017 (05:56 IST)
తెలుగు తెరపై అందాల ఆరబోతకు అందరికంటే ముందే సై అనే ఆ ముద్దుగుమ్మకు సుడి బాగా ఉన్నట్లు లేదు. ఎంతగా అందాలారబోసినా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతోంది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌తో కలిసి అల్లుఅర్జున్‌తో వీరలెవల్‌లో అందాలను ఆరబోసినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇటీవల సరైనోడు చిత్రంలోనూ రెండవ నాయకి పాత్రతోనే సరిపెట్టుకుంది. 
 
తాజాగా ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శీను తాజా చిత్రంలో ఐటమ్‌గర్ల్‌గా మారిపోయింది. ఇందుకు భారీ పారితోషికమే(రూ.60 లక్షలు) పుచ్చుకుందంటున్నారు సినిమా వర్గాలు. అదేమంటే బోయపాటి కోసమే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాను అని సాకు చెబుతోంది.ఆయన సరైనోడు చిత్రంలో తనకు అవకాశం ఇచ్చారని,అందుకే ఆయన కోరిక మేరకు బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న జై జానకి నాయక చిత్రంలో సింగిల్‌ సాంగ్‌కు అంగీకరించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై ఐటమ్‌ సాంగ్‌కు ఆడేది లేదని అంటోంది. 
 
అసలు విషయం ఏమిటంటే ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేదు. ఇటీవల ఆర్యతో నటించిన కడంబన్‌ చిత్ర పరాజయం ఎఫెక్ట్‌ కావచ్చు. విష్ణువిశాల్‌తో నటించిన కథానాయకన్‌ చిత్రం విడుదల కావలసి ఉంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments