ఇలా ఇలా తేలాను... అంటున్న తలైవి.. రిలీజ్ చేసిన సమంత (Video)

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:44 IST)
Thalaivi song
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'తలైవి'. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గత కొంతకాలంగా సినీ, రాజకీయ, క్రీడా కారుల జీవిత కథ ఆధారంగా బయోపిక్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయలలిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియన్ సినిమాగా 'తలైవి' రూపొందించారు. సినీ తారగా, పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా, ఐరన్ లేడీగా జయలలిత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 
 
జయలలిత జీవితంలో అనూహ్య సంఘటనలెన్నో ఉన్నాయి. ఆ సంఘటలను వెండితెర మీద ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు విజయ్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా 'తలైవి' సినిమాని ఏప్రిల్ 23న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా తలైవి సినిమా నుంచి 'ఇలా ఇలా తేలాను' అంటూ సాగే పాటను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటను సైందవి ప్రకాష్ పాడారు. సిరా శ్రీ సాహిత్యం అందించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళంలో రిలీజ్ అయిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments