Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (15:34 IST)
కొత్త చిత్రాల విడుదల విషయంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ సినిమాల విడుదల అతివృష్టి లేదా అనావృష్టి అనే చందంగా తయారైంది. వస్తే వరుసబెట్టి చిత్రాలు విడుదలయ్యాయి. లేదంటే ఒక్క మూవీ కూడా విడుదలకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం ఏకంగా పది చిత్రాలు విడుదలయ్యాయి. 
 
గతవారం అంటే నవంబరు 14వ తేదీ ఒక డబ్బింగ్ సినిమా 'కంగువా'తో పాటు మరో స్ట్రైట్ తెలుగు మూవీ "మట్కా" మాత్రమే విడుదల అయ్యాయి. ఆ రోజు విడుదల కావాల్సిన "దేవకీ నందన వాసుదేవ" మూవీ ఈ వారానికి వాయిదా వేశారు. అలా వాయిదా వేయకుండా ఉంటే ఏమైనా వర్కౌట్ అయ్యేదేమోననే టాక్ నడుస్తోంది. ఎందుకంటే గత వారం విడుదలైన రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ రోజు మొత్తానికి ఏకంగా పది సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
 
ఇందులో విశ్వక్సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకీ', అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ', సత్యదేవ్ హీరోగా నటించిన 'జీబ్రా', రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తున్న 'కేశవ చంద్ర రమావత్' (కేసీఆర్) మూవీలు కాస్త చెప్పుకోదగ్గవి ఉన్నాయి. ఇవికాకుండా 'రోటి కపడా రొమాన్స్', 'ఉద్వేగం', 'పిచ్చోడు', 'ఝాన్సీ ఐపీఎస్', 'కనకమహాలక్ష్మి' వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
 
అదేవిధంగా తమిళంలో విడుదల అయి తెలుగులో ఇప్పుడు డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్న సన్నీ లియోన్ 'మందిర' అనే మూవీకూడా ఉంది. అయితే వీటిలో 'రోటి కపడా రొమాన్స్' సినిమాతో పాటు 'ఝాన్సీ ఐపీఎస్' అనే రెండు సినిమాలకు థియేటర్లు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను తాలిబన్ ఫైటర్లు ఆక్రమిస్తారా?

ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

Annamalai : కొరడాతో ఆరు సార్లు కొట్టుకున్న అన్నామలై.. చెప్పులు వేసుకోను.. ఎందుకు? (video)

హిట్, ఫ్లాప్స్‌తో పాటు వివాదాలకు తెరలేపిన 2024 తెలుగు సినిమా రంగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments