Raashi Khanna : సిద్ధు జొన్నలగడ్డ తో అద్భుతమైన ప్రయాణం తెలుసు కదా : రాశీ ఖన్నా

దేవీ
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (08:05 IST)
Raashi Khanna, Sidhu Jonnalagadda, Srinidhi Shetty
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
 
తెలుసు కదా జర్నీ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి... తెలుసు కదా అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీంకి  కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్‌గా ఉంటుంది.
 
థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి డీవోపీ జ్ఞాన శేఖర్. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొళ్ల ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ షీతల్ శర్మ.
 
తెలుసు కదా సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.
తారాగణం: సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments