Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాలయ్యా... మీరే ఆదర్శ'మన్న సాయి ధరమ్ తేజ్... హ్యాట్సాఫ్ అన్న మంచు మనోజ్

నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన తెలుగు

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (10:26 IST)
నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన తెలుగు చిత్ర యువ హీరోలు తమ ట్వీట్లతో బ్రహ్మరథం పడుతున్నారు. 
 
హీరో మంచు మనోజ్ ఒక గంట క్రితం, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ 40 నిమిషాల క్రితం చిత్రంపై స్పందించారు. "డేరింగ్ డాషింగ్ నటసింహ బాలయ్య అన్నకు, క్రిష్ బాబాయ్‌కి థ్యాంక్స్. శరణమా... రణమా" అని మనోజ్ ట్వీట్ చేయగా, "జీపీఎస్కే గురించి గొప్పగా రిపోర్టులు వస్తున్నాయి. చిత్ర బృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అలాగే, "బాలయ్యా... మీరు మాలో చాలామందికి ఆదర్శం" అంటూ మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. 
 
అలాగే, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కూడా ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. గురువారం ఉదయమే సినిమా చూసిన ఆయన, తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. "ఈ కథను 79 రోజుల్లో ఇంత అద్భుతంగా ఎలా తీశారు? నమ్మశక్యం కావడం లేదు. మీ నుంచి నేను ఎంతో ఎంతో నేర్చుకోవాలి. సాయి మాధవ్... నీ కలమే శాతకర్ణి ఖడ్గం. అద్భుతమైన కెమెరా పనితనం, అత్యద్భుతమైన నిర్మాణ విలువలు శాతకర్ణి చిత్రాన్ని సుదీర్ఘకాలం పాటు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ చిత్రం తెలుగు పరిశ్రమకు గర్వకారణం" అని ఆయన ట్వీట్ చేశారు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments