Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు... ట్వింకిల్ ఘటనపై రష్మీ గౌతమ్ ఫైర్

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (12:37 IST)
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ ప్రాంతంలో.. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారిని పదివేల అప్పుకోసం కంటి గుడ్లు పీకేసి గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశారు. అత్యంత పాశవికంగా మారిన ఈ ఘటనను సామాన్య ప్రజానికమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఖండిస్తున్నారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు సన్ని లియోన్, అభిషేక్ బచ్చన్, తదితరులు తమ స్పందనల్ని తెలియజేయగా.. టాలీవుడ్ నుండి యాంకర్ రష్మి రియాక్ట్ అవుతూ.. ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు మహ్మద్ జాహిద్‌ను బహిరంగంగా ఉరితీయాలని సోషల్ మీడియాలో #JusticeforTwinkleSharma హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్లు స్పందనలు తెలియజేస్తున్నారు. 
 
తాజాగా ఈ ఘటనపై రష్మీ తీవ్రంగా స్పందించింది. ''ట్వింకిల్.. ట్వింకిల్.. లిటిల్ స్టార్.. హౌ వుయ్ వండర్ హౌ యు ఆర్. కఠినమైన చట్టాలు రావడానికి ఇంకా ఎంత మంది బలవ్వాలి. మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు'' అంటూ ''జస్టిస్ ఫర్ ట్వింకిల్'' హ్యాష్‌ ట్యాగ్‌తో భావోద్వేగ ట్వీట్‌ను షేర్ చేశారు రష్మి. యాంకర్ రష్మీ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి వారికి బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ పెరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

నేపాల్‌లో భారీ భూకంపం - భారత్ కూడా ప్రకంపనలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments