తమిళంలో 96.. తెలుగులో 2009.. సమంత వల్లే ఇలా జరిగిందా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:38 IST)
తమిళంలో హిట్ కొట్టిన త్రిష 96 ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో త్రిష పాత్రలో సమంత నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే 96 పేరుతోనే ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ... ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ టైటిల్ మారనుంది. తమిళంలో 96గా విడుదలైన ఈ సినిమాలో తెలుగు 2009 టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
గత ఏడాది తమిళంలో విడుదలైన సినిమాల్లో 90 సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. వసూళ్ల పరంగానూ ఈ సినిమా అదరగొట్టింది. ప్రస్తుతం ఇదే సినిమాలో తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కర్ణాటకలోనూ ఈ సినిమా రీమేక్ కానుంది. తెలుగు రీమేక్‌కు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమారే డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
 
తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కనుంది. తమిళంలోని స్కూల్ ఫ్లాష్ బ్యాక్‌లా కాకుండా తెలుగులో కాలేజీ ఫ్లాష్ బ్యాక్‌ను పెట్టనున్నట్లు చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది. 
 
అందుచేత ఫ్లాష్ బ్యాక్ దృశ్యాలు 96లో కాకుండా 2009లో జరిగినట్లు వుంటాయని సినీ బృందం వెల్లడించింది. ఈ మార్పులకు సమంతనే కారణమని.. సమంత ఐడియా ప్రకారమే ఈ సినిమా తెలుగు రీమేక్ అవుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments