Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీర

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (10:31 IST)
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్య భూషణ్ రావు గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తండ్రితో అనుబంధాన్ని, ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశాంత్, తన సోషల్ మీడియా ద్వారా హృదయాన్ని తాకేలా స్పందించాడు. 
 
ఆయన చాలా సరదాగా ఉండేవారని, చాలా నెమ్మదైన వ్యక్తని, ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. స్నేహితులు, కుటుంబంతో ఆయన గడిపిన మధుర జ్ఞాపకాలు తన మదినిండా ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. ఆయనకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే సమయం వచ్చిందని, అందుకే వెళ్లిపోయారంటూ పోస్ట్ చేశాడు. 
 
ఆయన జీవితంలో తామంతా భాగమైనందుకు సంతోషంగా ఉందని అంటూనే, తండ్రిని చాలా మిస్సవుతున్నానని, ఈ సమయంలో తన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న సన్నిహితులు, బంధువులకు ధన్యవాదాలని అన్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments