Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kiran Abbavaram: దిల్ రూబా స్టోరీ లైన్ చెప్పు, బైక్ గిఫ్ట్ కొట్టు : కిరణ్ అబ్బవరం

దేవి
సోమవారం, 3 మార్చి 2025 (10:05 IST)
Dil Ruba Bike
సినిమాలకు కొత్త ప్రచారం కు కథానాయకుడు కిరణ్ అబ్బవరం శ్రీకారం చుట్టాడు. ఇంతకు ముందు చాలామంది ప్రేక్షకులకు పలు కాంటెస్ట్ లు పెట్టి ఆకట్టుకున్నారు. ఇటీవలే సాయి రామ్ శంకర్ కూడా తన సినిమా ఒక పథకం ప్రకారం కు ఇంటర్వెల్ వరకు చూసి విలన్ ఎవరో చెపితే పది వేలు బహుమతి ప్రకటించారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఓ ప్రకటన వెలువరించారు.
 
"దిల్ రూబా" స్టోరీ లైన్ ఊహించి చెప్పిన వాళ్లకు ఈ సినిమాలో హీరో నడిపిన బైక్ గిఫ్ట్ గా అందించబోతున్నారు. "దిల్ రూబా" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతకు బైక్ అందించడంతో పాటు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అదే బైక్ మీద సినిమా చూసేందుకు కిరణ్ అబ్బవరం వెళ్తారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్, సాంగ్స్, ప్రెస్ మీట్స్ లో టీమ్ చెప్పిన డీటెయిల్స్ తో "దిల్ రూబా" స్టోరీ లైన్ గెస్ చేసిన ఎవరైనా ఈ స్పెషల్లీ డిజైన్డ్ బైక్ సొంతం చేసుకోవచ్చు.
 
దిల్ రూబా" సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్,  ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

పార్టీ మారే డీఎన్ఏ తన రక్తంలోనే లేదు : డీకే శివకుమార్

Janasena: పిఠాపురంలో జనసేన వ్యవస్థాపక దినోత్సవం- సమన్వయ కమిటీ సభ్యులు వీరే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments