Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు బెయిల్

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (14:05 IST)
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నృత్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించినట్టయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్టు తన శిష్యురాలు, మహిళా కొరియోగ్రాఫర్ శృష్టివర్మ హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీంతో గత నెల 16వ తేదీన ఆయనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. 
 
ఆ తర్వాత ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో గత నెల రోజులుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. అయితే, ఆయనకు ఇచ్చిన జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేసింది. దీంతో ఆయన మళ్లీ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. 
 
తాజాగా ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు... ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జానీ మాస్టర్ గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. జానీ మాస్టర్‌కు బెయిల్ రావడంతో అనేక మంది నృత్య దర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం