Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-2.. భానుశ్రీకి ఎంత పెద్దమనుసు.. తేజస్వి ఎలిమినేషన్ లీక్..

బిగ్ బాస్-2 నుంచి భాను శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్-2లో హానెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భానుశ్రీ తన పెద్ద మనసును చాటుకుంది. ఈ వీకెండ్ అనాథ పిల్లలతో కలిసి గడిపింది. అయితే వీ

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (12:25 IST)
బిగ్ బాస్-2 నుంచి భాను శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్-2లో హానెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భానుశ్రీ తన పెద్ద మనసును చాటుకుంది. ఈ వీకెండ్ అనాథ పిల్లలతో కలిసి గడిపింది. అయితే వీళ్లు సాధారణ అనాథలు కాదు.. ఎవరో చేసిన పాపానికి పుట్టుకతోనే ఎయిడ్స్ మహమ్మారిని తెచ్చుకున్న అభాగ్యులు. 
 
ఇలాంటి వారి దరికి చాలా పెద్ద మనసుంటే కానీ వెళ్లరు. అలాంటి మనసు తనకుందని నిరూపించుకుంది భాను. రోజంతా వారితో కలిసి ఆడింది పాడింది. ఆ పిల్లలతో కలిసిపోయి వారితో భోజనం కూడా చేసింది. నెట్టింట భానుశ్రీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
మరోవైపు టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 ఎలిమినేషన్ ఫలితం మరోమారు లీకైంది. ఆదివారం తేజస్వి ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చేశాయి. బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ రియాల్టీ షోలో ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ఒకరోజు ముందే స్టార్ మా సిబ్బంది షూట్ చేస్తారన్న సంగతి తెలిసిందే.

ఈ షోలో ప్రేక్షకులుగా చాలామంది యువతీ యువకులు కూర్చుని ఉంటారు. వారి ముందు నిలబడి నాని వ్యాఖ్యాతగా ఎలిమినేషన్‍ను నడిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ షూట్ అయిపోగానే బయటకు వచ్చే ప్రేక్షకుల్లో కొందరు ఎలిమినేషన్‌పై పోస్టులు పెడుతున్నారు. 
 
ఆదివారం తేజస్వి హౌస్ నుంచి బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి చాలా మంది టీవీ ప్రేక్షకులు సైతం తేజస్వీయే ఎలిమినేట్ అవుతుందని ముందుగానే ఊహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments