Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్ బర్త్ డే పోస్టర్

డీవీ
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (14:55 IST)
Mirai Poster
పాన్ ఇండియా సక్సెస్ 'హను-మాన్'తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ 'మిరాయ్‌'లో అలరించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తునారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్ ని పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
సినిమాలో తేజ సజ్జా పాత్రలోని కరేజియస్ స్పిరిట్ ని హైలైట్ చేస్తూ పోస్టర్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పోస్టర్‌లో తేజ సజ్జ మండుతున్న ఐరెన్ రాడ్‌ను పట్టుకుని పైకి చూస్తున్నట్లు టెర్రిఫిక్ గా కనిపించారు. ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ ఇంటెన్స్ గా వున్నారు. బ్యాక్ డ్రాప్ లో వెనుక ఒక పురాతన దేవాలయం ఉంది. ఈ పోస్టర్ ప్రేక్షకులని కట్టిపడేసింది.
 
తేజ సజ్జా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా కోసం బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారని బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. న్యూ వరల్డ్ ని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని నైపుణ్యం కనిపిస్తుంది. అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా టెక్నికల్ గా టాప్ క్లాస్ లో వుండబోతోంది.
 
తేజ సజ్జ, మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
 
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు డైలాగ్ రైటర్ మణిబాబు కరణంతో కలసి  స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.  గౌర‌హ‌రి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్.
 
'మిరాయ్‌'ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న వేసవిలో 2డి, 3డి వెర్షన్‌లలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments