Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్, గోపీచంద్ హ్యాండిచ్చారట... హోరాహోరీ డైరెక్టర్ తేజ ఎగ్రసివ్...

Webdunia
గురువారం, 30 జులై 2015 (21:51 IST)
ఇంతవరకు తాను సైలెన్స్‌గా వున్నాననీ.. కానీ ఈ మధ్యనే ఎగ్రెసివ్‌గా మారాలనుకున్నాననీ, అందుకే మారాననీ, లేకపోతే ఇండస్ట్రీలో వుండటం కష్టమంటూ దర్శకుడు తేజ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'హోరా హోరీ' సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ... అందరూ తనను 'జయం' లాంటి సినిమా తీయమంటున్నారు. ఎన్నిసార్లు తీస్తాను.. అంతకుముందు నిజం, నువ్వు నేను తీశాను. బాగా ఆదరించారు. మళ్ళీ జయం అంటే.. నా సినిమాను నేనే తీయాలా! ఇది కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారేమోననిపిస్తుందని తెలిపారు. 
 
కాగా, ఈ ఆడియో వేడుకకు ఇండస్ట్రీలో పలువుర్ని పిలిస్తే.. అనుకున్నవారు ఎవ్వరూ రాలేకపోవడం.. ఆయన ఎగ్రెసివ్‌గా మారడానికి కారణమైందని తెలుస్తోంది. నితిన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజనే. అలాంటి నితిన్‌ కూడా.. తేజకు హ్యాండ్‌ ఇచ్చాడు. మరోవైపు, గోపీచంద్‌ సిటీలో ఉండి కూడా రాలేదని తెల్సి కడుపు మండిపోయిందట. ఇండస్ట్రీలో ఉన్న కొందరికి తనే లైఫ్‌ ఇచ్చాననీ, అలాంటిది తనకే నామాలు పెట్టారని సన్నిహితుల దగ్గర తేజ ఫీలైపోయాడట. 
 
మరో ఇద్దరు, ముగ్గురు హీరోలను పిల్చినా షూటింగ్‌లు అంటూ జంప్‌ అయ్యారట. సక్సెస్‌ లేకపోతే ఇవాళ, రేపు హీరోలు ఎవ్వర్నీ లెక్కచేయటం లేదనీ, ఇండస్ట్రీలో అన్నీ వ్యాపార సంబంధాలేనని వాపోయాడట. ఇండస్ట్రీలో మార్కెట్‌ బావుంటే కాళ్లు పట్టుకోవటానికైనా రెడీగా ఉంటారనీ, ఎంతకాలమైనా ఎదురుచూస్తారనీ, అడిగినంత రెమ్యూనరేషన్‌ ఇస్తారనీ, అదే పరిస్థితి తలకిందులైతే... పట్టించుకునేవాడు కూడా ఉండడని బాధపడినట్లు సమాచారం. తను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తీసిన సినిమా ఆడియో ఫంక్షన్‌కు తను పరిచయం చేసిన వారు కూడా రాకపోవటం తేజను బాధించిందని తెలిసింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments