మసూదతో బిగ్ హిట్ అందుకున్న హీరో తిరువీర్ ఇప్పుడు రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన పరేషాన్అనే హిలేరియస్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకులు శైలేష్ కొలను, వినోద్, శాంటో, ప్రవీణ్, మల్లిక్, ఉదయ్ తో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ చిత్రం తెలంగాణలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. అక్కడ స్నేహితుల గ్యాంగ్, వారి జీవితాల్లోని అస్తవ్యస్తమైన పరిస్థితులు, సిల్లీ సంఘటనలు.. చిక్కులు తెచ్చిపెడతాయి. తిరువీర్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో పావని కరణం కనిపించింది. వారు ఎదుర్కొనే సమస్యలు హిలేరియస్ గా వున్నాయి. దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్ పరేషాన్ ని యూనిక్ గా ట్రీట్ చేశారు. టీజర్లో మంచి కంటెంట్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.
రూపక్ రోనాల్డ్‌సన్ తన హ్యుమరస్ రైటింగ్ తో ప్రతి సన్నివేశానికి వినోదాత్మకంగా మలిచారు. తిరువీర్ ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పోషించగల నటుడని నిరూపించుకుంటున్నాడు. అతను మద్యానికి బానిసైన పాత్రలో జీవించేశాడు.
ఈ చిత్రానికి డీవోపీ వాసు పెండమ్, సంగీతం చౌరస్తా బ్యాండ్ యశ్వంత్ నాగ్.. ఇద్దరు టెక్నీషియన్లు తమ తమ పనితనాన్ని అద్భుతంగా కనబరిచారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి హరిశంకర్ ఎడిటర్. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో శైలేష్ కొలను మాట్లాడుతూ.. పావని చాలా అద్భుతమైన నటి. హిట్ 2 తన స్క్రీన్ ప్రజన్స్ బ్రిలియంట్. తిరువీర్ ఏ పాత్రని చేసినా దాన్ని నమ్మించగలిగే నటుడు. తనతో కలిసి పని చేయాలని వుంది. పరేషాన్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ అందరూ థియేటర్ కి వచ్చి సపోర్ట్ చేయాలి. ఇలాంటి సినిమాలని సపోర్ట్ చేస్తే కొత్త ఫిల్మ్ మేకర్స్ మరింత ఉత్సాహంగా వుంటుంది అన్నారు.
తీరు వీర్ మాట్లాడుతూ.. పలాస సినిమా తర్వాత ఓ నాలుగు సీన్లు ఆడిషన్స్ ఇవ్వమని అడిగారు. సీన్లు చేస్తున్నప్పుడే తెగ నవ్వుకున్నాను. తర్వాత మళ్ళీ ఫుల్ నరేషన్ అడగలేదు. ఫుల్ నరేషన్ అడగకుండానే చేసిన సినిమా ఇది. ఈ సినిమా చాలా సహజంగా వుంటుంది. కోవిడ్ లో మొదలుపెట్టిన సినిమా ఇది. కొన్ని కారణాల వలన మేము అనుకున్న టెక్నికల్ టీం, యాక్టర్లు దొరకలేదు. ఈ టీం ని లగాన్ టీం అని పిలిచేవాడిని(నవ్వుతూ) ఈ టీం అందరికీ మంచి సినిమా చేయాలనే పిచ్చి వుంది. లాస్ట్ బాల్ స్టేజ్ లో వుంది. సిక్స్ కోడతామనే నమ్మకం వుంది అన్నారు.
పావని మాట్లాడుతూ.. పరేషాన్ తో లీడ్ క్యారెక్టర్ లో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుంది. పరేషాన్ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఎక్కడా పాలిష్ గా వుండదు. వూర్లో జీవితాలు కనిపిస్తాయి. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది.మంచి మ్యూజిక్ వుంది. ప్రేక్షకులు థియేటర్ లో డ్యాన్స్ చేశారు. ఇందులో ప్రతి పాత్ర మీకు గుర్తుండిపోతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు రూపక్ మాట్లాడుతూ.. ఒక ప్రాజెక్ట్ చేసినపుడు పేరు కోసం డబ్బు కోసం చేస్తారు. కానీ సినిమా కోసం చేసిన సినిమా పరేషాన్. ప్రొడ్యూసర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకూ అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
వాల్తేరు ప్రొడక్షన్స్ నిర్మాతలు మాట్లాడుతూ.. టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది జనం సినిమా. ఇంతమంది నటులు ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. ఇంతమంది నటీనటులు ఉన్నప్పటికీ కథని చాలా క్లారిటీ ప్రజంట్ చేసిన దర్శకుడికి అభినందనలు. ఈ సినిమాని ప్రేక్షకులకి చూపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ ఫిల్మ్. ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ ని కొంచెం కొత్తగ ప్రజంట్ చేసి కొంత సౌండ్ విజువల్ తో చేసిన సినిమా ఇది. మంచి కంటెంట్ వున్న సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన దర్శకులు శైలేష్ కొలను, వినోద్, శాంటో, ప్రవీణ్, మల్లిక్, ఉదయ్ .. అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రవీణ్ మాట్లాడుతూ.. ఆల్రెడీ హిట్ కొట్టేశారు. ఈ సినిమా ఎవరు తీసుకుంటో తెలీదు కానీ వాళ్ళు ఒక జాక్ పాట్ కొట్టినట్లే. ఇలాంటి సినిమా హిట్ అయితే అందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చినట్లుగా వుంటుంది. తురువీర్ నాకు చాలా ఇష్టమైన నటుడు. టీం అందరికీ అల్ ది బెస్ట్ చెప్పారు.