Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరప్‌కు పవన్ కల్యాణ్- త్రివిక్రమ్ టీమ్.. కీర్తి, అనూలతో పాటల షూటింగ్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పవన్ 25వ సినిమా షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కర్ణాటక - చిక్ మంగుళూరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (16:03 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న పవన్ 25వ సినిమా షెడ్యూల్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కర్ణాటక - చిక్ మంగుళూరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్‌ చేస్తున్నారు. ఈ ఫైట్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సినీ యూనిట్ అంటోంది. 
 
ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చేస్తుండగా పవన్ చేతికి గాయమైనా ఆయన లెక్కచేయకుండగా షూటింగులో పాల్గొంటున్నాడని సమాచారం. పవన్‌కు ఇది 25వ సినిమా అయినా.. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో రానున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను విదేశాలలో ప్లాన్ చేశారు. కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. 
 
ఈ షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణ వుంటుంది. నవంబర్ 15 వరకు యూరప్‌లోనే పవర్ స్టార్ 25 సినిమా పాటలను చిత్రీకరించనున్నారు. మూడు పాటలను యూరప్ లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారు.

పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ కూడా యూరప్ సెట్స్‌లో వుంటారని.. టీమ్ మొత్తం త్వరలో యూరప్‌కు బయల్దేరనుంది. అజ్ఞాత వాసి అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలనలో వుంది. తొలిసారిగా కొలవెరి సాంగ్‌కు సంగీతం సమకూర్చిని అనిరుధ్ పవన్ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments