Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజీగా ఉన్నానా అబ్బే.. నా చేతుల్లో రెండు సినిమాలే ఉన్నాయ్: తాప్సీ ట్వీట్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (09:55 IST)
సాధారణంగా హీరోయిన్లు తమ చేతిలో సినిమాలు లేకపోయినా.. చాలా సినిమాలున్నట్లు ఫోజులు కొడ్తుంటారు. అంతటితో ఆగకుండా మరో భాషలో బిజీగా ఉన్నామని చెప్పుకుంటారు. అయితే అందాల తాప్సీ మాత్రం ఇందుకు విభిన్నం. తన చేతిలో సినిమాలు లేవని తాప్సీ ధైర్యంగా చెప్పేసింది. ఝమ్మందినాదం సినిమాతో తెలుగుతెరపై అరంగేట్రం చేసిన తాప్సీ ట్విట్టర్లో ఆసక్తికర కామెంట్స్ చేసింది.
 
ట్విట్టర్లో తాను బిజీగా లేనని తేల్చి చెప్పింది. మీడియా ప్రచారం చేస్తున్నట్లు తాను బోలెడు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్‌లకు వెళ్ళట్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన చేతిలో రానా హీరోగా రూపొందుతున్న ఘాజీ, ఇంకా పేరు పెట్టని రైజింగ్ సన్ ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న సినిమాలే ఉన్నాయని ట్వీట్ చేసింది.
 
ఇకపోతే, తాప్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె ఏం చేసినా అందంగా ఉంటుందని.. అటు చీరకట్టైనా, మోడ్రన్ డ్రెస్ అయినా తాప్సీకి అదిరిపోతుందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. అయితే తాప్సీకి అదృష్టం ఇంకా వరించలేదని సినీ పండితులు అంటున్నారు. పెద్ద, హీరోలు, దర్శకులతో నటించినప్పటికీ.. అందాలను ఆరబోసినప్పటికీ ఆమె ఖాతాలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments