Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు నల్లద్రాక్ష పళ్లు తింటారా... అందుకే మీ...? తట్టుకోలేక వెళ్లిపోయిన నటి

ఈమధ్య కొన్ని టెలివిజన్ ఛానళ్లలో వెర్రి ప్రోగ్రాములు వస్తుండటం మనం చూస్తున్నాం. కొన్ని ప్రోగ్రాముల మెయిన్ ఎయిమ్ ఏంటయా అంటే ఎంత పగలబడి నవ్వితే అంత బాగా ప్రోగ్రాము రన్ అవుతున్నట్లు లెక్క. మరికొన్ని ప్రోగ్రాములు కుళ్లు జోకులు వేసుకుంటూ నడిపించేస్తారు. ఇల

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (21:46 IST)
ఈమధ్య కొన్ని టెలివిజన్ ఛానళ్లలో వెర్రి ప్రోగ్రాములు వస్తుండటం మనం చూస్తున్నాం. కొన్ని ప్రోగ్రాముల మెయిన్ ఎయిమ్ ఏంటయా అంటే ఎంత పగలబడి నవ్వితే అంత బాగా ప్రోగ్రాము రన్ అవుతున్నట్లు లెక్క. మరికొన్ని ప్రోగ్రాములు కుళ్లు జోకులు వేసుకుంటూ నడిపించేస్తారు. ఇలాంటి కార్యక్రమానికే హీరోయిన్ హాజరై ఆ తర్వాత ఆమెపై వేసిన జోక్ కు తట్టుకోలేక కార్యక్రమం మధ్యలోనే నిష్క్రమించింది. వివరాల్లోకి వెళితే... 'పర్చేద్' సినిమా గురించి తెలుసు కదా. 
 
ఈ చిత్రానికి హాలీవుడ్ లోనూ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా దర్శకురాలు లీనా యాదవ్, రాధికా ఆప్టే, తనిష్ఠా ఛటర్జీ, సుర్వీన్ ఛావ్లాలు అంతా కలర్స్ టీవీ నిర్వహించే 'కామెడీ నైట్స్ బచావ్' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం విశేషం ఏంటయా అంటే, 'రోస్ట్' పేరిట గేలి చేయడం. వచ్చినవారిని రోస్ట్ చేస్తుంటే అతిథులు పగలబడి నవ్వుతూ ఉంటారు. రోస్టులో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి తనిష్ఠా ఛటర్జీపై ఓ కుళ్లు జోకు వేశాడు. 
 
'మీరు నల్లరేగు పళ్లు ఎక్కువగా తింటారు కదా?' అని ప్రశ్నించాడు. ఆమె ఆ ప్రశ్న ఎందుకు వేశాడా అని ఆలోచించేలోపుగానే 'అందుకే మీరు నల్లగా ఉన్నారు' అని టపీమని చెప్పేశాడు. అతడు వేసిన ఈ కామెంటుకు అక్కడివారు పగలబడి నవ్వాలన్నమాట. కానీ ఛటర్జీ అతడి వ్యాఖ్యలపై మండిపడింది. ఓ వ్యక్తి రంగు గురించి మాట్లాడటం వివక్ష కిందకు వస్తుందని కోపంతో ప్రోగ్రాము మధ్యలోనే వెళ్లిపోయింది. ఆ తర్వాత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తన అభిప్రాయాలను వెల్లడించింది. ఆమెకు మద్దతు బాగా లభిస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments