Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్ నుంచి త‌నికెళ్ల శంక‌ర్ రాసిన శివ త‌త్వాన్ని ఆవిష్క‌రించిన తనికెళ్ల భరణి

దేవి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (15:03 IST)
Tanikella Bharani released the song
క‌ళ్యాణ్‌, సోఫియా ఖాన్‌, ఊహ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’. వి.జె.సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి.ఆర్‌.ప్రొడ‌క్ష‌న్‌, వి.జె.ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్‌పై ర‌విసాగ‌ర్‌, వి.జె.సాగ‌ర్ ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత త‌నికెళ్ల భ‌ర‌ణి చేతుల మీదుగా ‘ఓం నమః శివాయ’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. త‌నికెళ్ల శంక‌ర్ రాసిన ఈ పాట‌ను చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న సునీల్ క‌శ్య‌ప్ ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా తనికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ‘‘‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’ సినిమా నుంచి ‘ఓం న‌మః శివాయ‌’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేయ‌టం చాలా ఆనందంగా ఉంది. క‌ళ్యాణ్ హీరోగా వి.జె.సాగ‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో ర‌వి సాగ‌ర్‌తో క‌లిసి సినిమాను రూపొందించారు. త‌న‌కు న‌చ్చిన‌ట్లు బ‌తికే వ్య‌క్తి జీవిత ప‌రిణామ క్ర‌మంలో ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో సినిమాను రూపొందించారు. ఒక అనుభ‌వాన్ని, బాధ‌ను దిగ‌మింగుకుని త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించే హీరో గురించి తెలియ‌జేసే క్ర‌మంలో ఈ శివుడి పాట వ‌స్తుంది. క‌థలో చాలా కీల‌క‌మైన ఘ‌ట్టంలో పాట వ‌స్తుంది. సునీల్ క‌శ్యప్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. శివ త‌త్వాన్ని ఈ పాట‌లో త‌నికెళ్ల శంక‌ర్ పదాల‌తో ఎంతో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి వెలుగుతోంది. ఈ క్ర‌మంలో సాగ‌ర్ లాంటి యంగ్ డైరెక్ట‌ర్స్ కొత్త క‌థ‌ల‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
ద‌ర్శ‌క నిర్మాత వి.జె.సాగ‌ర్ మాట్లాడుతూ ‘‘‘ఎ స్టార్ హీరో ఈజ్ బార్న్’ సినిమా యూనిట్‌కు త‌న స‌పోర్ట్‌ను తెలియ‌జేస్తూ త‌నికెళ్ల‌భ‌ర‌ణిగారు ఓం న‌మః శివాయ పాట‌ను విడుద‌ల చేశారు. ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాం. సినిమా గురించి చెప్పాలంటే సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ పాయింట్‌తో తెర‌కెక్కుతోన్న‌ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments