Webdunia - Bharat's app for daily news and videos

Install App

యదార్థ ఘటనలకు ప్రతిరూపం తంగలాన్‌ : విక్రమ్‌

డీవీ
సోమవారం, 12 ఆగస్టు 2024 (16:03 IST)
Tangalan vij.pressmeet
కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా 'తంగలాన్‌' సినిమా ఆద్యంతం సాగుతుందని హీరో చియాన్‌ విక్రమ్‌ వివరించారు. హీరోగా చియాన్‌ విక్రమ్‌, హీరోయిన్లు మాళవిక మోహనన్‌, పార్వతీ తిరువోతు నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ 'తంగలాన్‌'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్‌ రూపొదించారు. నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తోంది. ఈనెల 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయవాడలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హీరో విక్రమ్‌, హీరోయిన్‌ మాళవిక మోహనన్‌, హాలీవుడ్‌ నటుడు డేనియల్‌, నిర్మాత దశరథన్‌ మాట్లాడారు. 
 
హీరో విక్రమ్‌ మాట్లాడుతూ,  వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో తీసిన పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో ఆదిత్య కరికాలన్‌గా నటించా. నాకు మీ లవ్‌ అందించారు. తంగలాన్‌ వందేళ్ల క్రితం జరిగిన కథ. ఇదొక బ్యూటీఫుల్‌ అడ్వెంచరస్‌ మూవీ. డైరెక్టర్‌ రంజిత్‌ తన ఆర్ట్‌ ఫామ్‌లో అందంగా రూపొందించాడు. తంగలాన్‌ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తారా అని వెయిట్‌ చేస్తున్నాను.  ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్‌ ఫార్మెన్స్‌లు చూపించారు. అవన్నీ చూసినప్పుడు ఎమోషన్‌ అయ్యాను. ఇవన్నీ చేశానా అనిపించింది. ఇంకా డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయాలనే స్ఫూర్తి కలిగింది. రంజిత్‌ గారు నా డ్రీమ్‌ డైరెక్టర్‌. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అన్నుకుంటున్నా. ఎందుకో గానీ కుదరలేదు. తంగలాన్‌ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. మీకు సర్‌ ప్రైజ్‌ గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్‌ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్‌, మెసేజ్‌, మ్యాజిక్‌, ఎమోషన్స్‌ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్‌ రోల్‌ అని అనుకుంటున్నా. జ్ఞానవేల్‌ రాజా మాకు ఫుల్‌ లిబర్టీ ఇచ్చి మూవీ ప్రొడ్యూస్‌ చేశారు. ఇది పాన్‌ ఇండియా కాదు వరల్డ్‌ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానవేల్‌ రాజా గారు. 
 
మా టీమ్‌ లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడి సినిమా కోసం వర్క్‌ చేశారు. మీరు థియేటర్స్‌ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్‌ తో కనెక్ట్‌ అవుతారు. పార్వతీ, మాళవిక చాలా బాగా పర్‌ ఫార్మ్‌ చేశారు. మీరు తంగలాన్‌ కు చూపిస్తున్న రెస్పాన్స్‌ కు థ్యాంక్స్‌. ఈ నెల 15న థియేటర్స్‌ లో కలుద్దాం' అన్నారు.  
 
హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ మాట్లాడుతూ  'మా బ్రదర్‌ విక్రమ్‌, డైరెక్టర్‌ పా రంజిత్‌, మాళవిక, పార్వతీ వీళ్లంతా లేకుంటే 'తంగలాన్‌' సినిమా జరిగేది కాదు. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు థ్యాంక్స్‌. 'తంగలాన్‌' ఒక అమోజింగ్‌ మూవీ. అమోజింగ్‌ ఎక్సీపిరియన్స్‌ ఇస్తుంది. థియేటర్‌ లో తప్పుకుండా చూడండి' అని కోరారు. హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ 'తంగలాన్‌'  సినిమాలో 'ఆరతి' అనే క్యారెక్టర్‌ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు పా రంజిత్‌ కు థ్యాంక్స్‌ చెబుతున్నా. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది. నా టీమ్‌ అందరికీ విక్రమ్‌, జ్ఞానవేల్‌ రాజా, పార్వతీ, డేనియల్‌ అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా. ఈ నెల 15న ''తంగలాన్‌''  సినిమా థియేటర్‌ లో చూసి ఎంజారు చేయండి' అని కోరారు. 
 
నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ  'తంగలాన్‌' సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన టీజర్‌, ట్రైలర్‌ కొంత మాత్రమే. సినిమాలో చాలా మెస్మరైజింగ్‌ కంటెంట్‌ ఉంది. ఛియాన్‌ విక్రమ్‌ అద్భుతమైన పర్‌ ఫార్మెన్స్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆయన ఈ క్యారెక్టర్‌ లో ఎలా నటించారని మీరు ఆశ్చర్యపోతారు. అంత డెడికేషన్‌తో విక్రమ్‌ నటించారు.'తంగలాన్‌' సినిమాను మా టీమ్‌ తో పాటు ప్రేక్షకులకు మెమొరబుల్‌ మూవీ అవుతుంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments