Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వినయ విధేయ రామ' ఫెయిల్యూర్‌కు కారణం చెప్పిన తమ్మారెడ్డి

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (16:02 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "వినయ విధేయ రామ". ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఈ చిత్రం ఫెయిల్యూర్‌పై ప్రముఖ సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా స్పందించారు. 
 
రామ్ చరణ్ నటించిన "రంగస్థలం" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన చిత్రం 'వినయ విధేయ రామ' కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం తొలి భాగం బాగానే ఉన్నప్పటికీ.. రెండో అర్థభాగం మాత్రం పూర్తి ఫైట్లతో నింపివేశారనీ, ఇదే పెద్ద మైనస్ పాయింట్‌ అని, ఈ కారణంగానే అభిమానులు అసంతృప్తికి లోనయ్యారని చెప్పారు. 
 
ఇకపోతే, సంక్రాంతికి రిలీజ్ అయిన మరో రెండు చిత్రాలపై కూడా ఆయన స్పందించారు. 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం తొలి భాగం బాగానే ఉన్నప్పటికీ రెండో భాగంపై మరింత శ్రద్ధ చూపించివుంటే బాగుండేదని ఆయన వెల్లడించారు. 
 
మూడో చిత్రం ఫ్యామిలీ డ్రామాకి కామెడీ కూడా తోడుకావడంతో "ఎఫ్-2" సినిమా బాగా ఆడుతోందన్నారు. సక్సెస్ .. ఫెయిల్యూర్ అనేవి ఎప్పుడూ ఒకచోట వుండవు. ఎవరి ప్రయత్నం వాళ్లు చేశారంతే అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments