సాధారణంగా హీరోల పాదాలకు అభిమానులు నమస్కరిస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. అభిమానుల పాదాలకు హీరో మొక్కారు. ఆ హీరో పేరు సూర్య. తమిళంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సూర్య తన అభిమానుల కాళ్ళు మ
సాధారణంగా హీరోల పాదాలకు అభిమానులు నమస్కరిస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. అభిమానుల పాదాలకు హీరో మొక్కారు. ఆ హీరో పేరు సూర్య. తమిళంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సూర్య తన అభిమానుల కాళ్ళు మొక్కి అందరు నోళ్ళెళ్ళపెట్టేలా చేశాడు.
ఈ సంఘటన సూర్య తాజా చిత్రం "గ్యాంగ్" (తెలుగు) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జరిగింది. స్టేజ్‌పైన ఉన్న సూర్య దగ్గరికి యాంకర్ కొందరు అభిమానులని ఆహ్వానిస్తుంది. వాళ్ళు రావడంతోనే సూర్య కాళ్ళపై పడిపోతారు. వెంటనే సూర్య కూడా వారి కాళ్ళకి నమస్కారం చేసి అక్కడి వారందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఈ సంఘటనకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూర్య ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోను ఎంతో ఒబీడియెంట్‌గా, డౌన్ టూ ఎర్త్ ఉంటారు. అందుకే సూర్యకి తమిళంలోనే కాదు తెలుగులోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిత్రం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది.