Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

డీవీ
సోమవారం, 25 నవంబరు 2024 (16:55 IST)
Vivek - Mervin, Ram, bhagyasri
#RAPO22 చిత్రానికి టాలెంటెడ్ అండ్ కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ - మెర్విన్ సంగీతం అందించనున్నట్లు ఈ రోజు తెలిపారు. ఈ సంచలన సంగీత ద్వయానికి రామ్ సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికారు. ''తెలుగు తెరపై సరికొత్త సంగీత సంచలనానికి స్వాగతం'' అని రామ్ ట్వీట్ చేశారు. వివేక్ శివ, మెర్విన్ సాల్మన్... ఇద్దరూ కలిసి వివేక్ - మెర్విన్ పేరుతో మ్యూజిక్ చేయడం మొదలు పెట్టారు. 
 
తమిళంలో తొలి సినిమా 'వడా కర్రీ'తో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే... వాళ్లిద్దరూ సంగీతం అందించిన ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ 'ఓర్శాడా...', 'పక్కం నీయుమ్ ఇళ్లై...' చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ధనుష్ హీరోగా నటించిన 'పటాస్' చిత్రానికి సంగీతం అందించారు. ఆ సినిమాలోని 'చిల్ బ్రో...' సాంగ్, ఇంకా ప్రభుదేవా 'గులేబకావళి'లోని గులేబా సాంగ్, కార్తీ 'సుల్తాన్' సినిమాలోని సాంగ్స్... ఇలా వివేక్ - మెర్విన్ సూపర్ డూపర్ హిట్ పాటలకు మ్యూజిక్ అందించారు. ఇప్పుడీ సంగీత ద్వయాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు రామ్, దర్శకుడు మహేష్ బాబు పి. తమిళ సంగీతం వినే ప్రేక్షకులకు వివేక్ - మెర్విన్ పరిచయమే. రామ్ సినిమాతో వాళ్ళిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతుండడంతో సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.‌ 
 
తెలుగులో తమ తొలి సినిమాకు వాళ్ళిద్దరూ ఎటువంటి పాటలు అందిస్తారోననే ఆసక్తి మొదలైంది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.‌ ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తే పనుల్లో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సీఈవో: చెర్రీ, సంగీతం: వివేక్ - మెర్విన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, దర్శకత్వం: మహేష్ బాబు పి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments