Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెల్లగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న తమిళ యువ హీరోలు..

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (16:47 IST)
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్‌ల హవా కొనసాగుతోంది. మరోవైపు పక్క భాషల నుండి నటులు తెలుగులో నటించడానికి సై అంటున్నారు.


ఇది వరకు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ తంబీలు ఇప్పుడు తెలుగులో స్ట్ర్రెయిట్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో కమల్‌హాసన్, రజనీకాంత్‌లు నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండేవారు. 
 
కొన్నాళ్లకు విక్రమ్, సూర్య, విశాలు నటించిన చిత్రాలు అలాగే తెలుగులోకి అనువాద చిత్రాలుగా రిలీజైయ్యాయి. అయితే హీరో కార్తీ మరో అడుగు ముందుకు వేసి హీరో నాగార్జున్‌తో కలిసి తెలుగులో ఊపిరి అనే తెలుగు చిత్రంలో నటించాడు. ఆ మధ్య తమిళ యువ హీరో ఆర్య అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు చిత్రంలో విలన్‌గా నటించాడు. మరో యువహీరో అరుణ్ విజయ్ కూడా బ్రూస్‌లీ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. 
 
హీరో ఆది పినిశెట్టి కూడా సరైనోడు సినిమాలో విలన్‌గా నటించాడు. అయితే ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమైన సాహో, వాల్మీకి, సైరా, కౌసల్య కృష్ణమూర్తి చిత్రాల్లో తమిళ హీరోలు నటిస్తుండడం విశేషం..సాహో చిత్రంలో అరుణ్ విజయ్ ప్రముఖ పాత్ర పోషిస్తుండగా, వాల్మీకి చిత్రంలో తమిళ కుర్రహీరో అధర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 
 
చిరంజీవి తాజా చిత్రం సైరాలో తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రాజా పాండి అనే పాత్రలో కనిపించనున్నాడు. తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కనా సినిమా రీమేక్‌గా వస్తున్న కౌసల్య కృష్ణమూర్తి చిత్రంలో తమిళ యువ హీరో శివకార్తికేయన్ క్రికెట్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాలన్నీ ఒక నెల సమయంలో విడుదల కానుండడం మరో విశేషం.
 
ఈ చిత్రాలు విజయాలు సాధించినట్లయితే, మరింత మంది యువ హీరోలు తెలుగులో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నాలుగు చిత్రాలు మంచి విజయాలను అందుకుని ఈ కుర్రహీరోలకు మంచి పేరు తెచ్చిపెడతాయని ఆశిద్ధాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments