Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో హీటెక్కించిన రాధిక కామెంట్స్.. స్థానికేతరులను తమిళులు ఆదరించాలా? జయలలిత, రజనీ?

తమిళసూపర్ స్టార్‌ రజనీకాంత్‌కు ఏం తెలుసునని.. ఆయన రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానని నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాట రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని.. రజనీ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (15:55 IST)
తమిళసూపర్ స్టార్‌ రజనీకాంత్‌కు ఏం తెలుసునని.. ఆయన రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటానని నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాట రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని.. రజనీపై తానలా మాట్లాడలేదని శరత్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు.

అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే-డీఎంకే పార్టీల మధ్య అమ్మ లేకపోవడంతో పాటు స్థానికత అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది. రాష్ట్రంలో స్థానికేతరులు రాజ్యమేలుతున్నారని.. వారిని అడ్డుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు నటి రాధిక. 
 
ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, వైగో, విజయ్‌కాంత్ వంటి నేతలంతా స్థానికేతరులేనని రాధిక ఆరోపించారు. వీరిని ఆదరించాల్సిన అవసరం తమిళులకు లేదని ఒక్కముక్కలో తేల్చేశారు. పనిలో పనిగా నడిగర్ సంఘంలోని నేతలను కూడా ఏకిపారేశారు రాధిక. హీరో విశాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడని, కార్తి, శివరామ్ వంటి నటులు ఎక్కడివాళ్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వీరంతా తమిళులా అంటూ ప్రశ్నించారు.

జయలలిత, రజనీకాంత్ సైతం తమిళ వ్యక్తులే కాదని ఇక్కడ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. రాధిక వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయ వాతావరణం హీటెక్కింది. 
 
రాధిక ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకిస్తుందని ఇటు సినీ, అటు రాజకీయ నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల నడిగర సంఘంలో కొద్దిరోజులుగా కోల్డ్‌వార్ జరుగుతోంది. నిర్మాతల సంఘం ఎన్నికలు కూడా జరుగనున్నాయి. నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌ని టార్గెట్ చేయడంతో రాధిక స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు సినీ, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు రాధిక వ్యాఖ్యలపై రాజకీయ, సినీవర్గాల్లో దుమారం రేపడం ఖాయమని చర్చించుకుంటున్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో తన భర్తను గుర్తింపు లభించకపోవడం.. అనవసరపు ఆరోపణలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలవడమే శరత్, రాధికల టార్గెట్ అంటూ రజనీ ఫ్యాన్స్ అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments