Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (22:38 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు కష్టాలు మొదలయ్యాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమన్నా వద్ద విచారణ జరిపారు. ఇంతకీ తమన్నాను ఈడీ ఎందుకు ప్రశ్నించిందనే వివరాల్లోకి వెళితే.. బెట్టింగ్ యాప్ కేసులో ఆమెను విచారించారు. 
 
ఇటీవల ఈడీ తమన్నాకు సమన్లు జారీ చేయగా, గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు గౌహతిలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె తల్లి కూడా ఆమెతో వచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు ఈడీ తమన్నా వద్ద విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంలో తమన్నా భాటియాను నిందితురాలిగా విచారించడం లేదు. కానీ హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌కు ప్రచారం చేసినందుకు ఆమె వద్ద విచారిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ప్రజలు రూ. 57,000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా కోట్లాది మంది డబ్బులు పెట్టి మోసపోయారు. ఈ విషయం కూడా మహాదేవ్ యాప్ స్కామ్‌తో ముడిపడి ఉంది. ప్రజలు దీని ద్వారా డబ్బు సంపాదించి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టేవారు.
Tamannah
 
ఈ కేసులో ఇప్పటి వరకు రూ. 497.20 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పటికే ఓసారి ఈడీ ముందు హాజరైన తమన్నాకు.. ఈ యాప్ ప్రమోషన్‌లో భాగంగా మళ్లీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments