Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ షిసిడో బ్రాండ్ అంబాసిడర్‌‌గా తమన్నా.. హాఫ్ నాలెడ్జి ప్రశ్నలొద్దు..?

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (20:18 IST)
దక్షిణాదినే కాకుండా ఉత్తరాది భాషల్లోనూ రాణిస్తున్న తెల్లపిల్ల తమన్నా అరుదైన రికార్డును సాధించింది. జైలర్ సినిమాలో ‘కావాలా’ పాట సూపర్ హిట్టయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై తమన్నా దృష్టి పెట్టింది. 
 
తాజాగా జపాన్ సౌందర్య సాధనాల ఉత్పత్తుల సంస్థ షిసిడోకు భారతీయ దూతగా తమన్నా ఎంపికైంది. ఈ కంపెనీ మొదటి భారత అంబాసిడర్‌గా తమన్నా ఎంపిక కావడం విశేషం. వందేళ్ల పాటు కాస్మొటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై తమన్నా హర్షం వ్యక్తం చేసింది. 
 
మరోవైపు తాజా ఇంటర్వ్యూలో తమన్నా మీడియాపై ఫైర్ అయ్యింది. వయస్సు పెరుగుతున్న కొద్దిగా బోల్డ్ నెస్ ఎక్కువైందని.. తగ్గిన అవకాశాలు పెంచుకునేందుకేనా ఈ తపన అంటూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు తమన్నాకు చెర్రెత్తుకొచ్చింది.
 
"తోచింది రాసిన అంత తేలిక కాదు యాక్టింగ్.. అయిన నాకు అవకాశాలు తగ్గాయని మీకు ఎవరు చెప్పారు? నేను రోజుకి 18 గంటలు పని చేస్తున్నా ఇంత బిజీగా గతంలో కూడా లేను. నా పరిధి ఏంటో నాకు తెలుసు నా ప్రవర్తన వేషధారణ అనేవి.. పాత్ర డిమాండ్‌ను బట్టి ఉంటాయి. 
 
క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తాను.. ఒక పాత్ర ఒప్పుకున్నాక దానికి పూర్తి న్యాయం చేయటమే నటిగా నా ధర్మం.. హాఫ్ నాలెడ్జి ప్రశ్నలు అడగవద్దు ప్లీజ్" అంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments