Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మా' పేద కళాకారులకు ప్రభుత్వం నుంచి పింఛన్ ఇప్పిస్తా... తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా' అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల శివాజీ రాజా బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ పార్టీలో రాజేంద్రప్రసాద్‌తో కలిసి సభ్యులందరు ఏకగ్రీవంగా 'మ

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (22:11 IST)
'మా' అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల శివాజీ రాజా బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టూ గెదర్ పార్టీలో రాజేంద్రప్రసాద్‌తో కలిసి సభ్యులందరు ఏకగ్రీవంగా 'మా' అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటరీగా నరేష్‌లను ప్రతిపాదించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిసి విషెస్ అందుకున్నారు. 
 
మంత్రి తలసాని కలిసిన శివాజీ రాజా, నరేష్‌లు 'మా' పేద కళకారులకు పింఛన్, ఇళ్ల నిర్మించాలని కోరారు. దీనికి స్పందిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ " 'మా' అధ్యక్షులుగా శివాజీరాజా, జనరల్ సెక్రటీగా నరేష్‌లు ఉండాలనే నిర్ణయాన్ని దర్శకరత్న దాసరి నారాయాణరావు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మేము అంగీకరించామని శివాజీ రాజా, నరేష్‌లు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. శివాజీ రాజా, నరేష్‌లు అడిగిన అంశాలన్నింటికి తెలంగాణ ప్రభుత్వం సహాయం చేస్తుంది. పేద కళకారులకు పింఛన్, 'మా' అసోసియేయన్ సొంత భవనం ఏర్పాటు చేసుకోవడానికి మా ప్రభుత్వం సహాయసహాకారలను అందిస్తుందిన్నారు. చిత్ర పరిశ్రమకి సంబంధించి ఎలాంటి సహాయాన్ని చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. త్వరలోనే 'మా' సభ్యులందర్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడిస్తా" అన్నారు.
 
దాసరిని పరామర్శించిన శివాజీ రాజా, నరేష్...
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న డా. దాసరి నారాయాణరావు గారిని శుక్రవారం ఉదయం నటులు శివాజీ రాజా, నరేష్‌లు పరామర్శించారు. గతంలో ఆయన చెప్పిన విధంగానే 'మా' అసోసియేషన్ అధ్యక్షులుగా శివాజీ రాజా, జనరల్ సెక్రటీగా నరేష్‌లు మొట్టమొదటిసారిగా ఆయనే ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments