Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ మూవీలో టబు... ఇంత‌కీ ట‌బు లుక్ ఎలా ఉంటుందో తెలుసా..?

Webdunia
గురువారం, 25 జులై 2019 (22:00 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా టైటిల్‌ను ఖరారు చేయని ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నివేదా పేతురాజ్ కనిపించనుంది.
 
 ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ టబు కూడా ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకి స్వాగతం చెబుతూ గీతా ఆర్ట్స్ వారు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 'హాయ్' చెబుతూ .. తన పాత్రకి సంబంధించిన డైలాగ్స్‌ను చూసుకుంటూ టబు సంప్రదాయబద్ధమైన లుక్‌తో చాలా అందంగా కనిపిస్తోంది. 
 
ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్న‌ట్టు ఇటీవ‌ల అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌లిసి చేసిన జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు స‌క్స‌ెస్ సాధించ‌డంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తార‌ని చిత్ర యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments