Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్నా.. తాప్సీ

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (15:48 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు - మంచు మనోజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఈ సినిమా తర్వాత మిస్టర్ ఫర్ఫెక్ట్, వీరా, మొగుడు వంటి చిత్రాల్లో నటించింది. అయితే, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ అమ్మడుకి ఆశించిన గుర్తింపురాలేదు. ఫలితంగా ఆమె తన మకాంను బాలీవుడ్‌కు మార్చేసింది. 
 
అక్కడ మంచి కథాంశంతో ఉన్న చిత్రాల్లో నటిస్తూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయ‌ణంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. 
 
తాప్సీ త‌న సోదరి షగున్‌తో కలిసి తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని రాజకుమారుడి గురించి కూడా లీక్ చేసింది. తాను ఓ వ్యక్తితో ప్రేమించినట్టు, అయితే, తాను ప్రేమించే వ్యక్తి ఓ నటుడని తెలిపింది. క్రికెటర్ మాత్రం కాదని తెలిపింది. పైగా, అస‌లు భారతీయుడే కాదు అని చెప్పి అంద‌రికి షాకిచ్చింది. 
 
'ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్న తర్వాతే నాకు నా రాజకుమారుడు దొరికాడు' అని తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. అయితే 'నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కాకుండా మాత్రం పిల్లల్ని కనను. అలాగని నా పెళ్లి ఆడంబరాలతో ఉండకూడదు. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య స‌ర‌దాగా జ‌ర‌గాలి' అని ఆమె స్ప‌ష్టం చేసింది.
 
కాగా, తాప్సీ చెబుతున్న వ్యక్తి డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనా అని పలువురు అంటున్నారు. కానీ, తాప్సీ మాత్రం సినీ నటుడని చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments